Thursday, July 18, 2019

గ్రీన్‌కార్డ్ కష్టాలు



కాలిఫోర్నియా నుంచి మార్క్, ఇంకో ఇద్దరు కొలీగ్స్ ప్రాజెక్ట్ పని మీద టెక్సాస్‌కి రావడంతో టీం అంతా డిన్నర్‌కి వెళ్ళారు.

పాతికమంది ఉన్న టీంలో ముగ్గురో నలుగురో అమెరికన్స్, మిగిలిన వాళ్ళంతా దేశీలు, మెజారిటీ తెలుగువాళ్ళు.

తింటూ, వైన్ చప్పరిస్తూ ఆ మాటా ఈ మాటా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

'Hey Suresh! What happened to your Green Card? Did you get it yet?' అడిగాడు మార్క్.

గ్రీన్‌కార్డ్ అన్న మాట వినగానే ఎక్కడలేని నీరసం వచ్చేసింది సురేష్‌కి.
'Not yet, Mark. Still waiting for it. It may take another six months.' విరక్తిగా అన్నాడు..

'You said the same thing last year also.'

'Yeah. I have been thinking the same for the last three years. What to do? The dates are not moving at all. I was hoping that I would at least get EAD this year, but the chances of getting that also look bleak now. My parents want me to visit India and get married. I have been postponing it thinking that I can get married peacefully after I get my GC. My marriage is also getting postponed because of my GC.' కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు సురేష్.

'You should marry an american citizen, that would solve all the problems for you.' జోకాడు పక్కనున్న రమేష్.

'I am ready to do that. But I don't know any american girls.'

'I may be able to help you with that' మధ్యలో అందుకున్నాడు మార్క్.

'Really?' సురేష్ కళ్ళల్లో ఎక్కడో ఓ చిన్న ఆశ మిణుకుమిణుకుమంది.

'Yeah. I have a daughter who is single.' సాండ్‌విచ్ నములుతూ చెప్పాడు మార్క్.

'Oh. How old is she?' ఈ భారీపర్సనాలిటీకి కూతురంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ అడిగాడు.

'She is 23.'

'Cool. Did she break-up with her boy friend recently or something like that?' కొంత కుతూహలంగా, కొంత అనుమానంగా అడిగాడు.

'No. She never had any boy friend. Not that we know of, at least.' కాజువల్‌గా చెప్పాడు మార్క్.

ఆశ్చర్యంతో, ఆనందంతో సురేష్ మొహం వెలిగిపోయింది. తనపేరున్న గ్రీన్‌కార్డ్ అప్పుడే ఒక్కక్షణం కళ్ళముందు మెరిసింది.

'Do you think she will like me?' ఉత్సాహాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.

'Sure. Just tell her that you cook Indian food well. She loves Indian food.' నాప్‌కిన్‌తో మూతి తుడుచుకుంటూ సలహా పడేసాడు మార్క్.

'ఛీ! మరీ వెధవబ్రతుకైపోయింది, నా వంటతో ఇంప్రెస్ చేయాలా?' అన్నట్టు మొహం పెట్టి రమేష్ వంక చూసాడు సురేష్.

'తేరగా గ్రీన్‌కార్డ్ వస్తుందంటే వంటచేయడానికేం మాయరోగం?' చిన్నగా గొణిగాడు రమేష్.

అంతేలే అని చిన్నగా రమేష్‌తో అని, పైకి ' Sure. I love cooking Indian food.' మొహాన తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సమాధానమిచ్చాడు.

తన కూతురు కాలిఫోర్నియాలో తమకి దగ్గరలోనే ఉంటుందనీ, కాలేజ్ అయ్యాక ఏదో కంపెనీలో రీసెంట్‌గా ఇంటర్న్‌గా చేరిందనీ చెప్పుకుపోతున్నాడు మార్క్.

'Do you have a picture of her by any chance?' ఓపిగ్గా వింటున్న సురేష్ కుతూహలాన్ని అణుచుకోలేక మార్క్ మాటల్ని కట్ చేస్తూ అడిగేసాడు.

'Yep. I do.' వైన్ కొంచెం సిప్ చేసి సాండ్‌విచ్ చివరిముక్కని నోట్లో కుక్కుకుని లేచి నుంచుని వాలెట్‌లో నుంచి ఒక ఫొటో తీసి మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు.

'This is probably 6-7 months old. She has not changed much since then. I am not used to storing pictures in phone yet. I guess I am a bit old fashioned.' నవ్వాడు మార్క్ ఫొటో సురేష్ చేతికిస్తూ.

సురేష్ ఫొటోతీసుకోగానే పక్కనున్న రమేష్ కూడా అందులోకి తొంగిచూసాడు.

ఫొటోలో 20-25 ఏళ్ళ వయసున్న ముగ్గురు అందమైన తెల్ల అమ్మాయిలు, ఒక 4-5 ఏళ్ళ ముద్దొచ్చే పిల్లాడు ఉన్నారు.

ఆ అందమైన అమ్మాయిలని చూడగానే సురేష్, రమేష్‌లిద్దరికీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి.

'The one on the left most is my elder daughter. She is the one I am talking about' చెప్పాడు మార్క్.

'ముగ్గురిలోకీ ఆ అమ్మాయే చాలా బాగుంది. తంతే బూరెల బుట్టలో పడటమంటే ఇదే. నక్కని తొక్కొచ్చావు పో' లోగొంతుకతో అన్నాడు రమేష్, కొంత జెలసీతో.

'Great! She is looking good.' ఎక్సైట్‌మెంట్ ఆగలేదు సురేష్‌కి.

థాంక్స్ అంటూ కూతురి స్కూల్, కాలేజ్ కబుర్లుచెప్పడం మొదలుపెట్టాడు మార్క్. అవేవి చెవినపడట్లేదు సురేష్‌కి. కళ్ళముందు ఆ అందమైన అమ్మాయి, గ్రీన్‌కార్డ్ మాత్రమే కనిపిస్తున్నాయి.

'Who is the girl to the right of her?' మొత్తానికి కంట్రోల్ చేసుకుని ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.

'She is my younger one. She is in her final year of college.'

'Nice. Who is the one on right most?'

'She is her husband.' కూల్‌గా సమాధానమిచ్చాడు మార్క్.

సురేష్, రమేష్‌లకి మార్క్ చెప్పింది అర్ధం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. అర్ధమయ్యాక మొహంమీద ఎక్స్ప్రెషన్ కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ మార్క్ మాటలు వింటూకుర్చున్నారు. వాళ్ళిద్దరికీ కాలేజ్‌లో ఎలా అనుబంధం ఏర్పడింది, వాళ్ళు ఎలా పెళ్ళిచేసుకున్నారనే విషయాలు చెప్పుకుపోతున్నాడు మార్క్.

'గొప్ప కూతుర్ని కన్నావులే' గొణిగాడు సురేష్. 'ఆ అమ్మాయి సంగతి నీకెందుకు? నీ పెళ్ళి, నీ గ్రీన్‌కార్డ్ నీకు ముఖ్యం' అన్నట్టు చూసాడు రమేష్.

'Who is the boy then?' 2-3 నిమిషాల తర్వాత అడిగాడు సురేష్, మార్క్ వాక్ప్రవాహానికి అడ్డుకట్టవేస్తూ.

'He is my grandson, her son rather' ఫొటోని పాయింట్ చేస్తూ సమాధానమిచ్చాడు మార్క్.

'Whose son? Your younger daughter's?' గుండెని చిక్కబట్టుకుంటూ అడిగాడు సురేష్.

'No. My elder one's' అని కూల్‌గా చెప్పి తన మనవడు వాళ్ళమ్మతో కన్నా తమతోనే ఎక్కువ ఉంటాడనీ, మార్క్‌కీ, వాళ్ళావిడకీ తమ మనవడితో ఉన్న అనుబంధాన్ని వివరించడం మొదలుపెట్టాడు.

అవేవి చెవికెక్కడంలేదు సురేష్‌కి. అంతా అయోమయంగా అనిపించింది. రమేష్ వంక చూస్తే రమేష్ జాలిగా తననే చూస్తున్నాడు.

సురేష్‌ కళ్ళముందు ఇంక ఆ అమ్మాయి కనిపించలేదు. జీసీ మాత్రం ఇంకా ఎక్కడో దూరంగా మిణుకుమిణుకుమంటూ కనిపిస్తోంది.

'Is she divorced then?' మొత్తానికి ధైర్యాన్ని కూడదీసుకుని అడిగాడు.

'No. She was never married.'

'I don't understand. I thought you said she never had any boy friend.'

'No. She never had any boy friend.' సురేష్ ఎందుకలా అయోమయంగా అయిపోయాడో అర్ధంకాలేదు మార్క్‌కి.

'Then?' సురేష్‌కి అంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది.

'Then what? Oh..You mean the boy's father? I think I understand your confusion now. We don't know who his father is. I don't think my daughter knows it either. Well, I am not sure about that. Let's just say I don't know who the father is. I don't care about it anyway. I just love him.'

'ఏమైంది? ఏక్కడికి?' సడన్‌గా కుర్చీలోంచి లేచిన సురేష్‌ని చూసి ఆశ్చర్యంగా అడిగాడు రమేష్.

'నేనింక తట్టుకోలేను భయ్యా! నా పరిస్థితి చూస్తే నాకే ఏడుపొస్తోంది. పదినిమిషాలు నా కార్లో కుర్చుని ఏడ్చేసి వస్తాను.' విసురుగా అంటూ వెళ్ళిపోయాడు సురేష్.

2 comments: